19 నుంచి ఏపీ ఎంసెట్‌ హాల్‌టికెట్ల జారీ

9 Apr, 2017 01:42 IST|Sakshi
19 నుంచి ఏపీ ఎంసెట్‌ హాల్‌టికెట్ల జారీ

కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు వెల్లడి

సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్‌–2017 హాల్‌టికెట్ల జారీ ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుందని సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సీహెచ్‌ సాయిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎంసెట్‌ ఈసారి పూర్తిగా ఆన్‌లైన్లో నిర్వహిస్తు న్నామని, ఇంజనీరింగ్‌ పరీక్షను ఏప్రిల్‌ 24, 25, 26వ తేదీల్లో, అగ్రికల్చర్‌ పరీక్షను ఏప్రిల్‌ 28న ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు.

ఉర్దూ మాధ్యమం పరీక్ష రాయాలనుకొనేవారు కర్నూలులో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఏపీ ఎంసెట్‌కు రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల 10, రూ.5 వేల అపరాధ రుసుముతో ఈ నెల 17, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించుకోవచ్చునని చెప్పారు. ఏపీలో పలు నగరాలతో పాటు హైదరాబాద్‌లోని నాచారం, మౌలాలి, హయత్‌నగర్‌లలో 140 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వివరాలకు 0884–2340535, 0884–2356255 నంబర్లలో onlineapeamcet2017@ gmail. com ద్వారా సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు