-

పాత్రికేయ అంశాల్లో పరస్పర సహకారం

10 May, 2015 02:33 IST|Sakshi

ఐజేయూ- పీఎఫ్‌యూజే ఒప్పందం

హైదరాబాద్: పాత్రికేయులకు సంబంధించిన వృత్తిపరమైన అంశాలు, విద్యా శిక్షణ తదితర విషయాల్లో పరస్పర  సహకారం అందించుకోవాలని ఇండియా, పాకిస్తాన్‌లకు చెందిన ప్రముఖ జర్నలిస్టు సంఘాలు నిర్ణయించుకున్నాయి.  ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్‌యూజే) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరిందని ఐజేయూ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు దేశాల్లోని వర్కింగ్ జర్నలిస్టుల మధ్య సత్స ంబంధాలు మరింత బలోపేతం కావాలని, వృత్తిపరమైన అంశాలలో పరస్పర సహకారం అందించుకోవాలనే ఉద్దేశంతోనే ఎంవోయూ కుదుర్చుకున్నాయి. కరాచీలో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో పా ల్గొన్న 15 దేశాల జర్నలిస్టుల సమక్షంలో ఈ నెల 3న ఈ ఒప్పంద పత్రాలపై ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, పీఎఫ్‌యూజే సెక్రటరీ జనరల్ అమిన్ యూసష్ సంతకాలు చేశారు.  కార్యక్రమంలో ఐజేయూ కోశాధికారి షబీనా ఇందర్‌జిత్, పీఎఫ్‌యూజే అధ్యక్షుడు రాణా మహమ్మద్ అజీమ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు