ఏపీ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

21 Apr, 2020 20:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంస్థలు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. విరాళం మొత్తాన్ని ఆర్‌టీజీఎస్‌ ద్వారా సహాయనిధికి బదిలీ చేశారు. ఆ సంస్థ ఎండీ సమీర్‌ గోయల్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కె.సత్యనారాయణ విరాళానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందించారు. వారితో పాటు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపీ ఆయిల్‌ సీడ్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(ఏపీ ఆయిల్‌ ఫెడ్‌) రూ.50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. దీంతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల ఒక రోజు వేతనం లక్షా 86 వేల 936 రూపాయలను విరాళంగా అందించింది. ఆ సంస్థ చైర్మన్‌ వై.మధుసూదన్‌రెడ్డి, ఎండీ శ్రీకంఠనాధరెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. వారితో పాటు మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ కోపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (ఏపీ మార్క్‌ఫెడ్‌) కోటి రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో పాటు ఏపీ మార్క్‌ఫెడ్‌ ఉద్యోగుల తరపున లక్షా 7వేల రూపాయలను అందించింది. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ వై.మధుసూదన్‌రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

సీఎం సహాయనిధికి ఏపీ స్టేట్‌ వేర్ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల తరపున 7లక్షల 77వేల 979 రూపాయల విరాళాన్ని అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ వై.భానుప్రకాష్‌ విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

ముఖ్యమంత్రి  సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ (ఆప్కాబ్) కోటి 16 లక్షల  విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఉద్యోగుల తరపున కూడా 4 లక్షల 32 వేల 506 రూపాయలను విరాళంగా అందజేసింది. ఆ సంస్థ పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌ జి.వాణీమోహన్‌, ఆప్కాబ్‌ ఎండీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందించారు. వారితో పాటు మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలు రూ.50 లక్షల 66వేల రూపాయలు ప్రకటించాయి. ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీవో హరినాథ్‌రెడ్డి, హార్టికల్చర్‌ కమిషనర్‌ చిరంజీవి చౌదరి విరాళం చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. వారితో పాటు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు