కరోనా ఎఫెక్ట్‌: అన్నవరం దేవస్థానం కీలక ప్రకటన

16 Mar, 2020 11:32 IST|Sakshi

సాక్షి, కాకినాడ: కరోనా వైరస్‌ ప్రభావం దేవుళ్లపై కూడా పడింది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో అన్నవరం ఆలయానికి వచ్చే భక్తులకు అన్నవరం దేవస్థానం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే తిరుమల,శ్రీశైలం లాంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలు కరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు కొన్ని కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా అన్నవరం సత్యదేవుని దేవస్థానం కూడా కీలక సూచనలు చేసింది. (కంగారెత్తిస్తున్న కరోనా)

సత్యనారాయణ స్వామి వ్రతమాచరించే భక్తులు తమ వెంట 12 సంవత్సరాల లోపు చిన్నారులు, ఆరవై ఏళ్ల పైబడిన వృద్ధులను తీసుకురావద్దని అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు కోరారు. మొక్కులను మూడు వారాల పాటు వాయిదా వేసుకోవాలని ఈవో సూచించారు. విదేశాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని మూడు వారాల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండటంతో ప్రత్యేక చర్యల్లో భాగంగానే ముందు జాగ్రత్త చర్యగా సూచనలు చేశామని.. భక్తులు గమనించాలని ఆలయ ఈవో కోరారు. (ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తొలి బాధితుడు)

మరిన్ని వార్తలు