ఏపీలో తొలి కరోనా మరణం

3 Apr, 2020 13:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదయ్యింది. వైరస్‌ సోకి షేక్‌ సుభాని (55) అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులిటెన్‌ ప్రకారం.. షేక్‌ సుభాని డయాబెటిస్‌ కార్డియాక్‌ ఆరోగ్య సమస్యలతో మార్చి 30న విజయవాడలోని జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే అతని కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించిన వైద్యులు.. కుమారుడితో పాటు సుభానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ మేరకు సుభానికి చికిత్స అందిస్తుండగానే శుక్రవారం మధ్యాహ్నం 12. 30 నిమిషాలకు మృతి చెందారు. (నెల్లూరులో అత్యధికంగా కరోనా కేసులు)

అయితే బాధితుడితో కాంటాక్ట్‌ అయిన 29 మందిని గుర్తించిన అధికారులు వారందరినీ నిర్బంధ కేంద్రానికి తరలించారు. మరోవైపు సుభాని కుమారుడు ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తేలిపే పనిలో ఏపీ అధికారులు నిమగ్నమయ్యారు. కాగా శుక్రవారం నాటికి రాష్ట్రంలో మొత్తం 161 కరోనా పాటిజివ్‌ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలో ఈ సంఖ్య రెండువేలు దాటింది.
 

మరిన్ని వార్తలు