ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

2 Jul, 2020 06:49 IST|Sakshi

ఇప్పటి వరకూ కోలుకున్న వారు 6,988 మంది 

ఒకే రోజు 477 మంది డిశ్చార్జ్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు తొమ్మిది లక్షల మార్కును అధిగమించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 28,239 పరీక్షలు నిర్వహించడం ద్వారా.. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 477 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 6,988కు చేరింది. కొత్తగా 657 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 15,252కి చేరాయి. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 2,036 ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించినవి 736. కొత్తగా ఆరుగురి మృతితో మొత్తం మరణాల సంఖ్య 193కి చేరింది. యాక్టివ్‌ కేసులు 8,071 ఉన్నాయి. 

రాప్తాడు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ 
అనంతపురం హాస్పిటల్‌: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు గన్‌మన్, ఇద్దరు కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకినట్టు తెలిసింది. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న మరో 16 మందికి బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.  

>
మరిన్ని వార్తలు