హోం క్వారంటైన్‌లో స్విమ్స్‌ వైద్యుడు

28 Mar, 2020 09:13 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడిని ముందస్తు చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్‌లో ఉంచారు. తెలంగాణకు చెందిన ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. అయితే, అంతకు ముందు ఆయన ఈ నెల 17న ఇండిగో విమానంలో తిరుపతికి వచ్చారు. స్విమ్స్‌ ఆస్పత్రిలోని ఓ డాక్టర్‌ను కలిసి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో స్విమ్స్‌ వైద్యుడికి కరోనా సోకే అవకాశం ఉందని భావించిన అధికారులు ఆయనను హోం క్వారంటైన్‌లో ఉంచారు. (ఒకేరోజు 14 మందికి కరోనా పాజిటివ్)

కాగా తిరుపతిలో  లాక్‌డౌన్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. దీంతో ఫోన్‌చేస్తే ... నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే పంపిస్తున్నారు. మరోవైపు జనం నివాస గృహాలకే పరిమితం కావాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి, నగర పాలక కమిషనర్‌ గిరీష్‌ సూచించారు. శనివారం ఉదయం వీరు ప్రధాన వీధుల్లో పర్యటించారు. అనవసరంగా వీధుల్లోకి వస్తే కేసులు నమోదు తప్పదని హెచ్చరించారు. (ఇంటికెళ్లండి ప్లీజ్..!)


 

మరిన్ని వార్తలు