కరోనా: ఏపీలో మరో 60 పాజిటివ్‌ కేసులు

1 May, 2020 12:12 IST|Sakshi

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1463

సాక్షి, అమరావతి: కోవిడ్‌ టెస్టుల్లో ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1463 కు చేరిందని తెలిపింది. తాజాగా 82 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 403కు చేరుకుందని పేర్కొంది. 

వైరస్‌ బారినపడి గడిచిన 24 గంటల్లో రెండు కోవిడ్‌ మరణాలు సంభవించాయని, దీంతో మొత్తం సంఖ్య మృతుల 33కు చేరుకుందని వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1027 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ చెప్పింది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది. కాగా, ప్రతి పది లక్షల జనాభాకు ఏపీలో 1919 మందికి టెస్టులు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఏపీ 1,02,460 కోవిడ్‌ పరీక్షలు చేసింది.

మరిన్ని వార్తలు