ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

5 Jul, 2020 14:09 IST|Sakshi

గడిచిన 24 గంటల్లో 998 కొత్త కేసులు నమోదు

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
(చదవండి : ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు)

ఇక గడిచిన 24 గంటల్లో 391 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 232కు చేరింది. ఈ రోజు మృతి చెందిన వారిలో కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణ, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,043 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు