ఏపీలో మరో రెండు వైరాలజీ ల్యాబ్‌లు

11 Apr, 2020 14:44 IST|Sakshi

తిరుపతి రుయా, కర్నూలు ఆస్పత్రిలో ఏర్పాటు

ల్యాబొరేటరీల నిర్వహణాధికారి డా.మల్లికార్జున వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం 7 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉండగా అదనంగా తిరుపతి రుయా ఆస్పత్రి, కర్నూలు జనరల్‌ ఆస్పత్రిలో ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. రోజుకు ఒక్కో ల్యాబ్‌లో 180 పరీక్షలు చేసే సామర్థ్యంతో కొత్తవి ఏర్పాటు చేస్తామని, ల్యాబొరేటరీల నిర్వహణాధికారి, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ.మల్లికార్జున ‘సాక్షి’కి తెలిపారు.

ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
కరోనా వచ్చే నాటికి మన రాష్ట్రంలో తిరుపతిలో స్విమ్స్‌లో మాత్రమే వైరాలజీ ల్యాబ్‌ ఉండేది.
► ఇప్పుడు ఆ సంఖ్య 7కు చేరింది. ఈ ల్యాబ్‌లలో రోజుకు 1,170 టెస్టులు చేస్తున్నాం.
► లివెందులలోని జినోమ్‌కార్ల్‌ అనే సంస్థ పశువులకు సంబంధించి పరిశోధనలకు ల్యాబొరేటరీ నిర్వహించేది. ఇప్పుడా పరికరాలు ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ పరికరాలు కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం.
► ఐసీఎంఆర్‌ అనుమతులు ఇస్తే కొత్తగా ఏర్పాటు చేసే రెండు ల్యాబ్‌లు పది రోజుల్లోగా అందుబాటులోకి వస్తాయి.
► అప్పుడు ల్యాబ్‌ల సంఖ్య 9కి చేరుతుంది. దీంతో రోజుకు 1,530 టెస్టులు చేసే వీలుంటుంది

ఇది చదవండి: వారికి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు