కరోనా: కోయంబేడు లింకులపై ఆరా 

12 May, 2020 07:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు: చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో 50 మందికి పైగా కరోనా వైరస్‌ భారిన పడ్డారు. ఈ ప్రభావం చిత్తూరు, నెల్లూరుతో పాటు తాజాగా జిల్లాలో బయటపడింది. ఇప్పటికే తమిళనాడు పోలీసులు సెల్‌ టవర్‌ లోకేషన్‌ల ఆధారంగా పంపిన వివరాల మేరకు అర్బన్‌ జిల్లాలో 40 మందికిపైగా, రూరల్‌ జిల్లాలో  80 మంది ఈ మార్కెట్‌తో సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే అర్బన్‌ జిల్లాలో ప్రస్తుతం 25 మంది ఉండగా మిగిలిన వాళ్లు వేరే ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం. (రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి చర్యలు)

రూరల్‌ జిల్లాలో 34 మంది మాత్రమే ఉన్నారని మిగిలిన వాళ్లు ఉపాధి కోసం చెన్నై వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. రూరల్‌ జిల్లాలో ఉన్న వారిలో  తెనాలి సబ్‌ డివిజన్,  నరసరావుపేట,  బాపట్ల ప్రాంతానికి చెందిన వారుగా సమాచారం. వీరందరూ లారీ డ్రైవర్లు, క్లీనర్లు.  నిత్యం జిల్లా నుంచి కోయంబేడు– జిల్లాకు కూరగాయలు సరఫరా చేస్తుంటారని తెలుస్తోంది. పోలీసులు గుర్తించిన వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.   
 

>
మరిన్ని వార్తలు