-

కరోనా కల్లోలం: నెల్లూరులో హై అలర్ట్‌

13 Mar, 2020 20:27 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించింది. ఈ మేరకు కృష్ణపట్నం పోర్టు, శ్రీహరికోట రాకెట్‌ కేంద్రాలను అప్రమత్తం చేసింది. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలకు 18 వరకు సెలవులు ప్రకటించారు. స్విమ్మింగ్‌పూల్స్‌ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నగరంలో సినిమా హాళ్లు మూసివేసినట్లు వెల్లడించారు.(ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్‌)

మాల్స్‌ను పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఎక్కువగా గుమిగూడవద్దని సూచించారు. వైద్యశాఖ పరిశీలనలో 150 మంది కరోనా అనుమానితులుండగా ఐసోలేషన్‌ వార్డులో 9 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఈ చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సూళ్లూరుపేటలో ముగ్గురు కరోనా అనుమానితులను గుర్తించగా వెంటనే వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు)

మరిన్ని వార్తలు