సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

6 Apr, 2020 03:30 IST|Sakshi
ఏయూ టీచింగ్, నాన్‌ టీచింగ్, కాంట్రాక్ట్, అడ్‌హాక్‌ ఉద్యోగుల తరఫున విరాళాల చెక్కులను వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి అందజేస్తున్న ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌

► ఏయూ టీచింగ్, నాన్‌ టీచింగ్‌తో పాటు కాంట్రాక్ట్, అడ్‌హాక్‌ ఉద్యోగులు ఒక రోజు జీతం రూ.91.48 లక్షలు.
► ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి రూ. 2.72 లక్షలు
► గుంటూరులోని సింగెంటా సంస్థ ప్రతినిధులు రూ.25 లక్షలు, నరసరావుపేటలోని న్యూ మధు లైటింగ్‌ సంస్థల ప్రతినిధులు రూ.2 లక్షలు 
► శ్రీ లక్ష్మీ గాయత్రి నగర్‌ రూ.లక్ష , విక్టరీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు రూ.లక్ష, కొత్తూరు గోపి రూ.లక్ష, వాసవీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు రూ.లక్ష, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత షేక్‌ ఖాజావలి రూ.లక్ష, ఉప్పలపాడు వాసి శనివారపు శివారెడ్డి రూ.లక్ష, వి.సాంబశివరావు రూ.లక్ష, బీరం భాస్కరరెడ్డి రూ.50 వేలు, మద్ది రామబ్రహ్మానందరావు రూ.50 వేలు, రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధి బత్తుల మురళీ రూ.21,216, డాక్టర్‌ నరసింహారెడ్డి, కాసింరెడ్డి, రామారావు కలిపి రూ.2 లక్షలు.
► నరసరావుపేటకి చెందిన సాయి సూర్య డెవలపర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ రూ.2 లక్షలు, వాగ్దేవి విద్యాసంస్థల డైరెక్టర్లు రూ.లక్ష, కృష్ణవేణి విద్యాసంస్థలు, ఎంఏఎం విద్యాసంస్థలు సంయుక్తంగా రూ.4 లక్షలు, వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగి కొల్లి సాంబిరెడ్డి రూ.లక్ష , కాలిఫోర్నియాలో ఉంటున్న ఆయన కుమారుడు మధుబాబు రూ.లక్ష , వ్యవసాయ శాఖ మాజీ ఉద్యోగి అవుతు ప్రకాష్‌రెడ్డి రూ.40 వేలు, బాపట్ల కు చెందిన వ్యాపారి ప్రవీణ్‌కుమార్‌ రూ.లక్ష , వరుణ్‌ హేచరీస్‌ రూ.లక్ష, ఆక్వా కల్చర్‌ రూ.లక్ష , సీబీజెడ్‌ చర్చి రూ.లక్ష. 
► మొవ్వ వ్యవసాయ కమిటీ పూర్వపు చైర్మన్‌ చీకటిమర్ల శివరామప్రసాద్‌ రూ.లక్ష
► విజయవాడ వాకర్స్‌ అసోసియేషన్‌ రూ.లక్ష 
► హైకోర్టులో ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న స్టాండింగ్‌ కౌన్సిళ్లు రూ.7.80 లక్షలు, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులందరూ రూ.5.80 లక్షలు.

మరిన్ని వార్తలు