సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

9 Apr, 2020 05:31 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు విరాళం చెక్కును అందజేస్తున్న రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవోలు ఎం. గౌతమ్‌రెడ్డి, ఆళ్ల శరత్‌

► రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.3 కోట్లు
► మిడ్‌వెస్ట్‌ గ్రానైట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. కోటి 
► ఆంధ్రప్రదేశ్‌ టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ రూ.కోటి 
► సీఎం సహాయ నిధికి మౌరి టెక్‌ ఫౌండేషన్‌ రూ. 50 లక్షలు విరాళం అందజేసింది.
► పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత పానెం హనిమిరెడ్డి రూ.25 లక్షలు
► నాగార్జున గ్రూప్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రూ.30 లక్షలు
► గండ్లూరు వీరప్రతాప్‌ రెడ్డి సీఎం సహాయ నిధికి రూ. 30 లక్షలు ఇచ్చారు
► ఆక్వా రైతు జంపన రామ లింగరాజు రూ. 2 లక్షలు 
► కైకలూరు మండలం ఆల పాడుకు  చెందిన ఐశ్వర్య ఇమ్‌ ఫెక్స్‌ మేనేజ్‌మెంట్‌ రూ.2 లక్షలు
► ఆంధ్రా లయోలా వాకర్స్‌ అసోసియేషన్‌ రూ.2 లక్షలు
► మచిలీపట్నం ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం రూ.లక్ష 
► వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.లక్ష 
► కీర్తి గ్యాస్‌ కంపెనీ అధినేత మామిడి వరప్రసాద్‌ రూ.లక్ష 

పీఎం సహాయ నిధికి రాష్ట్ర న్యాయవ్యవస్థ విరాళం 
కరోనా  వ్యాప్తిని అడ్డుకునే చర్యల నిమిత్తం పీఎం సహాయనిధికి రాష్ట్ర న్యాయ వ్యవస్థ విరాళం ఇవ్వాలని నిర్ణయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి చొరవ తీసుకుని ఈ నెల 6న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మిగిలిన న్యాయమూర్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి రూ. 50 వేలు, న్యాయమూర్తులు ఒక్కొక్కరు రూ. 25 వేల చొప్పున విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. హైకోర్టు రిజిస్ట్రా్టర్లు, ఓఎస్‌డీలు, ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జీలు, అదనపు జిల్లా జడ్జీలు ఒక్కొక్కరు రూ. 20 వేలు, సీనియర్‌ సివిల్‌ జడ్జీలు ఒక్కొక్కరు రూ. 15 వేలు, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు ఒక్కొక్కరు రూ. 12 వేలు, గెజిటెడ్‌ హోదా అధికారులు ఒక్కొక్కరు రూ. 10 వేలు, ఎన్‌జీవోలు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు రూ. 5 వేలు, ఇతర సబార్డినేట్‌ సిబ్బంది, డ్రైవర్లు రూ. 1,000 చొప్పున విరాళం ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రా్టర్‌ జనరల్‌ రాజశేఖర్‌ కోరారు.  విరాళం ఇవ్వదలచిన వారు ఈ నెల 15 కల్లా తమ విరాళాలను హైకోర్టుకు అందేలా చూడాలని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా