సీఎం సహాయనిధికి విరాళాలు 

16 Apr, 2020 05:26 IST|Sakshi
తూ.గో.జిల్లా కో–ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సొసైటీలు, ఉద్యోగుల తరఫున సీఎంకు విరాళం చెక్కును ఇస్తున్న డీసీసీబీ చైర్మన్‌ ఎ.ఉదయభాస్కర్, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి

కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు బుధవారం సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. 
► ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) రూ.10 కోట్లు. 
► రాష్ట్రంలో 110 పట్టణ ప్రాంతాల్లోని 2.33 లక్షల స్వయం సహాయ సంఘాలు రూ.కోటి విరాళం. 
► తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, ప్రాధమిక సహకార సంఘాలు, ఉద్యోగుల ఒక రోజు వేతం రూ.60 లక్షలు 
► పశ్చిమగోదావరి జిల్లా కో–ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సొసైటీలు, ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.45 లక్షలు 
► గుంటూరుకు చెందిన వ్యాపారవేత్తలు పాములపాటి చంద్రయ్య రూ.5 లక్షలు, బి.జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష, బి.ప్రసాద్‌రెడ్డి రూ.లక్ష 
► ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున రూ.3.25 లక్షలు 
► తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీంపు హేచరీస్‌ అసోసియేషన్‌ తరఫున సంఘం కాకినాడ అధ్యక్షుడు వీర్రెడ్డి, కార్యదర్శి హరినారాయణ రూ.30 లక్షలు  
► గుంటూరు జిల్లాకు చెందిన బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ రూ.10 లక్షలు 
► గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో నిర్మాణంలో ఉన్న మాతా అమృతానందమయి విశ్వ విద్యాపీఠం, అమృత డీమ్డ్‌ యూనివర్సిటీ రూ.5 లక్షలు  
 
ఇతర విరాళాలు  

► హెటేరో ఫౌండేషన్‌ ప్లూవిర్‌–75 ఎంజీ 50 వేల ట్యాబ్లెట్లు, రిటోకామ్‌ 50 వేలకుపైగా ట్యాబ్లెట్లు, హెచ్‌సీక్యూ రకం 97 వేల ట్యాబ్లెట్లతోపాటు లక్ష మాస్క్‌లు ప్రభుత్వానికి అందజేసింది. 
► ఎచ్చెర్లలోని డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల తరఫున రూ.10 లక్షలు విరాళం కలెక్టర్‌ జె.నివాస్‌కు అందజేశారు. 
► తిరుమలలోని ప్రతివాద భయంకర్‌ మఠం ప్రతినిధులు సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.2,11,111లు విరాళాన్ని డీడీల రూపంలో ఈవోకు ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు