కరోనా : సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు

4 Jun, 2020 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌ - 19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కలిసి లక్షా 10వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. కాగా వనిత వెంట కొవ్వూరు నియోజకవర్గ సహకార సంఘాలు, నీటి సంఘాలు, అంగన్‌వాడికి చెందిన మహిళలు, అభిమానులు ఉన్నారు.

తాడికొండ ఎమ్యెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గ నాయకులు, అభిమానులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి రూ. 25 లక్షలు విరాళం అందజేశారు.

కోవిడ్‌ - 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విశాఖపట్టణం అల్లిపురంకి చెందిన కల్వరి బాప్టిస్ట్‌ చర్చి రూ. 10లక్షలు, ఏయూ అఫిలియేటెడ్‌ బిఈడీ కాలేజెస్‌ ఆఫ్‌ విశాఖపట్టణం, విజయనగరం డిస్టిక్ట్స్‌ రూ. 3లక్షల 65 వేలు,  ఏపీ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజెస్‌ అసోసియేషన్‌, విజయనగరం జిల్లా రూ. లక్ష, ఎన్‌బిఎమ్ లా కాలేజి(విశాఖపట్టణం) రూ. 25 వేలు, విశాఖపట్టణం రుషికొండ వుడా హరిత టౌన్‌షిప్‌ రెసిడెంట్స్‌, ఫ్లాట్‌ ఒనర్స్‌ రూ. లక్ష విరాళంగా అందించారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వైఎస్‌ జగన్‌ను కలిసి సీఎం సహాయనిధి కింద అందిన చెక్కులు, డీడీలను అందజేశారు.

కోవిడ్‌ - 19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తులసి సీడ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ. 25 లక్షల విరాళం


 

మరిన్ని వార్తలు