సీఎం జగన్‌కు ప్రధాని ఫోన్‌

6 Apr, 2020 02:46 IST|Sakshi

కోవిడ్‌–19 నియంత్రణపై చర్చ

బకాయిలు ఇప్పించాలని ముఖ్యమంత్రి వినతి

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడానికి గల కారణాలను సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని కూడా వైఎస్‌ జగన్‌ ప్రధానికి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ఇటీవలే లేఖ రాశానని గుర్తుచేశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,100 కోట్లు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.2,200 కోట్లు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రూ.1,100 కోట్లు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1,050 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ.900 కోట్లు ఇప్పించాల్సిందిగా ప్రధానిని వైఎస్‌ జగన్‌ కోరారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ.. లేఖలోని అంశాలు తన దృష్టికి వచ్చాయని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు