గుంటూరులో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

19 Apr, 2020 10:07 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు రోజుల్లో కేవలం నలుగురికి మాత్రమే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. శనివారం పరీక్షించిన 563 నమూనాలు.. కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం జిల్లాలో 125 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో గుంటూరు సీటిలో 93 ఉన్నాయి.

గుంటూరులో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసింది. రెడ్‌ జోన్‌గా ప్రకటించడమే కాకుండా.. కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. కాగా, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 16 మంది మరణించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 129 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. 

చదవండి : వినూత్న విధానాలు అనుసరించండి

పెళ్లి వాయిదా వేసుకున్న మహిళా డీఎస్పీ

మరిన్ని వార్తలు