కరోనా: శ్రీకాళహస్తిలో ఇలా వ్యాపించింది! 

29 Apr, 2020 07:45 IST|Sakshi

సాక్షి, తిరుపతి: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు మొత్తం 74 నమోదైతే అందులో 43 శ్రీకాళహస్తిలోనే బయటపడ్డాయి. పట్టణంలో కరోనా కేసులు అధికంగా వెలుగు చూడడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై నెపం నెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా యత్నించాయి. అసలు విషయం తెలుసుకునేందుకు అధికారులు, నిపుణులు, మీడియా ప్రతినిధులు రెండు రోజులపాటు శ్రీకాళహస్తిలో వైరస్‌ వ్యాప్తికి కారణాలను అన్వేషించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణంలో తొలి కేసు లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి బయటపడింది. ఆ తర్వాత అన్నీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన వారివే అని అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి మర్కజ్‌కు 19 మంది వెళ్లొచ్చారు. (49 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తివేత)

తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు బయటపడే వరకు వీరందరూ యథావిధిగా తమ కార్యకలాపాలు సాగించారు. బంధువులు, మిత్రుల ఇళ్లకు రాకపోకలు సాగించారు. కొంతమంది నిత్యావసర సరుకులు, మందులు, కూరగాయల కోసం యథేచ్ఛగా సంచరించారు. ముఖ్యంగా పట్టణంలో ముస్లింలు నివసించే ప్రాంతాలు చాలావరకు ఇరుకు సందుల్లో ఉన్నాయి. దీంతో చాపకింద నీరులా కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఇంతటి నష్టం జరిగిపోయిందని ఓ ముస్లిం మతపెద్ద తెలియజేశారు. పాజిటివ్‌ కేసులు బయటపడిన తర్వాత కూడా కొంతమంది క్వారంటైన్‌ సెంటర్లకు వెళ్లలేదు. ఇది కూడా వైరస్‌ వ్యాప్తికి ఒక కారణంగా చెబుతున్నారు. పాజిటివ్‌ కేసుల బంధువుల్లో కొందరు అధికారులు ఉన్నారు. వీరు తమ సహచర సిబ్బందితో కలిసి తిరిగారని, అందుకే పలువురు ఉద్యోగులకు సైతం వైరస్‌ సోకినట్లు సమాచారం.  

శ్రీకాళహస్తిలో ఒకరికి పాజిటివ్‌ 
చిత్తూరు కలెక్టరేట్‌:  జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 7 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అందులో 74 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. 74 మందిలో 16 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 58 యాక్టివ్‌ కేసులున్నట్లు చెప్పారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెంటనే వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్‌ నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిరోజూ 800 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 400 పైగా పరిశ్రమలుండగా, గ్రీన్‌జోన్‌లో ఉన్న వాటికి మాత్రం 30 శాతం కారి్మకులతో పనులు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. 

క్వారంటైన్‌ సెంటర్ల నుంచి 174 మంది డిశ్చార్జి 
చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని 15 క్వారంటైన్‌ సెంటర్ల నుంచి మంగళవారం 174 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. ఏర్పేడు మండలంలో 69 మంది, తిరుపతిలో 54, కుప్పంలో 51 మొత్తం 174 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న ఈ 174 మందికి నెగిటివ్‌ రావడం, నిరీ్ణత గడువు ముగియడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఇంకా 518 మంది క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. అలాగే 26 షెల్టర్లల్లో 1,949 మంది నిరాశ్రయులకు వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు