రెడ్‌ జోన్లలో యాప్‌తో నిఘా

25 Apr, 2020 03:38 IST|Sakshi

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నుండి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంద ఏపీ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖను నిరంతరం అప్రమత్తం చేసేలా ప్రత్యేక యాప్‌లు తెస్తున్న రాష్ట్ర పోలీస్‌ శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ అభినందించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రెడ్‌ జోన్‌లలో నిఘా కోసం త్వరలోనే ప్రత్యేక యాప్‌ను తెస్తున్నట్టు వెల్లడించారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలలో ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా నిబంధనలు అమలు చేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. 

► రెడ్‌ జోన్‌లలో ప్రజల కదలికలను గుర్తించి అప్రమత్తం చేసేందుకు, వైరస్‌ తీవ్రతను తెలిపేందుకు మరో మొౖబైల్‌ యాప్‌ సిద్ధం చేస్తున్నాం. 
► ఇప్పటికే హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌ను విజయవంతంగా వినియోగించాం. జియో ఫెన్సింగ్‌ టెక్నాలజీలో ఇలాంటి యాప్‌ వినియోగంలో దేశంలోనే మన రాష్ట్రానికి మొదటిస్థానం. ► పలు దేశాల నుండి ఏపీకి వచ్చిన వారిపై నిఘాకు హౌస్‌ క్వారంటైన్‌  యాప్‌ వినియోగించాం.  
► హౌస్‌ క్వారంటైన్‌  యాప్‌ ద్వారా 22,478 మందిపై 28 రోజులపాటు నిఘా ఏర్పాటు చేశాం. 
► నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై ఆ యాప్‌ సహాయంతో కేసులు నమోదు.   
► 28రోజుల హోం క్వారంటైన్‌ పూర్తయిన వారిపై ఉన్న ప్రత్యేక ఆంక్షల తొలగింపు. నిబంధనల మేరకు బయట తిరిగేందుకు వెసులుబాటు.

మరిన్ని వార్తలు