విజయవాడలో కరోనా కలకలం

4 Mar, 2020 13:49 IST|Sakshi
చికిత్స పొందుతున్న యువకుడు

సాక్షి, విజయవాడ : బెజవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్‌ని తిరుపతికి పంపించే ఆలోచన చేస్తున్నారు. 

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఇప్పటికే 28 మందికి పాజిటివ్‌ వచ్చిందని కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ వెల్లడించారు. వారిలో 12మంది భారతీయులుకాగా, 16 మంది విదేశీయులు ఉన్నారు. ఇటలీ నుంచి వచ్చిన 14మంది పర్యాటకులకు కరోనావైరస్‌ సోకింది.  

చదవండి : 

దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి

కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్‌

కరోనా ఎఫెక్ట్‌.. మాస్క్‌తో ప్రభాస్‌

​​​​​​​తూర్పుగోదావరిలో కరోనా కలకలం!​​​​​​​

మరిన్ని వార్తలు