హైపోక్లోరైట్‌ పిచికారీ చేసిన ఎమ్మెల్యే రోజా

13 Apr, 2020 14:16 IST|Sakshi

సాక్షి, వడమాలపేట(చిత్తూరు జిల్లా): వడమాల గ్రామంలో ఓ యువకుడికి ఆదివారం కరోనా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా అధికారులు సోమవారం ప్రకటించారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంటి నుండి బయటకురా వద్దంటూ వడమాల పేట పోలీసులు లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వసతి గృహాల వద్ద నున్న మురికి కాలువలు శుభ్రపరుస్తూ పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్‌ చల్లారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం మేరకు సమస్యల పరిష్కారానికి అనుమతి వెసులుబాటు కల్పిస్తామని, వడమాలపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎమ్మెల్యే ఆర్కే రోజా అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ కరోనా వచ్చిన యువకుడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు. అధికారులతో కలిసి వడమాల గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
   
కూరగాయల పంపిణీ
నగరి మున్సిపల్‌ పరిధి సత్రవాడ 18,19 వార్డుల్లోని 500 కుటుంబాలకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా కూరగాయలు అందజేశారు. ఎమ్మెల్యే భర్త ఆర్కేసెల్వమణి, దాతలు వీఎం రామచంద్రన్, ఈవీ బాలకృష్ణన్, బీఆర్వీ అయ్యప్పన్‌ పాల్గొన్నారు. అబ్దుల్‌ కలాం షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రోజా చారిటబుల్‌ ట్రస్టుకు రూ.10 వేలు ఇచ్చారు. విజయపురం మండలంలోని 500 మంది అధికారులకు ఎమ్మెల్యే అన్నదానం చేశారు. మల్లారెడ్డి కండ్రిగ ప్రజలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. ఓజీ కుప్పానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత బాబు రూ.10 వేలు అందించారు. 

హైపోక్లోరైట్‌ పిచికారీ చేస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

తాజా అప్‌డేట్‌: ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు

మరిన్ని వార్తలు