సీఆర్‌డీఏలో వర్క్‌ ఫ్రం హోమ్‌

24 Mar, 2020 04:58 IST|Sakshi

50 శాతం ఉద్యోగులకు ఇంటి నుంచే పని 

సాక్షి, అమరావతి:  కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సీఆర్‌డీఏ ఉద్యోగుల్ని విడతలవారీగా ఇంటి నుంచి పనిచేయించాలని నిర్ణయించారు.  50 శాతం ఉద్యోగుల్ని సోమవారం నుంచి 29వ తేదీ వరకూ ఇంటి వద్ద నుంచి, మిగిలిగిన వారు కార్యాలయంలో పనిచేసేలా షెడ్యూల్‌ రూపొందించి అన్ని విభాగాలకు సర్క్యులర్‌ జారీచేశారు.  

- ఈ వారం ఇంటి నుంచి పనిచేసిన ఉద్యోగులు వచ్చేవారం 30వ తేదీ నుంచి కార్యాలయంలో, కార్యాలయంలో పనిచేసిన వారు ఇంటి నుంచి పనిచేస్తారు.  
- ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలొచ్చే వరకూ ఇలా విడతల వారీగా ఉద్యోగులు పనిచేస్తారు.  
- కార్యాలయంలో పనిచేసే వారిని మూడు విభాగాలుగా విభజించి సామాజిక దూరం పాటించేలా, మూడు సమయాల్లో పనిచేసేలా నిర్దేశింసినట్టు సీఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్‌ రామ్మోహనరావు చెప్పారు.  
- ఉద్యోగులు ఇంటి వద్దే ఈ–ఆఫీసు ద్వారా విధులు నిర్వర్తించాలని, ఫోన్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. 
- విభాగాధిపతులు, గెజిటెడ్‌ అధికారులు మాత్రం కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తారు.  
-  తుళ్లూరు, గుంటూరులోని సీఆర్‌డీఏ కార్యాలయాలు, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) కార్యాలయ ఉద్యోగులకూ ఇదే విధానాన్ని వర్తింపజేశారు.  

మరిన్ని వార్తలు