ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్‌

28 Mar, 2020 02:24 IST|Sakshi

13కు చేరిన కరోనా కేసులు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 13కు చేరింది. కొత్తగా నమోదైన రెండు కేసులూ విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి నుంచి సంక్రమించినవే. వాటిలో ఒకటి విశాఖపట్నంలో నమోదు కాగా, ఆ వ్యక్తి ఈనెల 17న బర్మింగ్‌హాం నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి విశాఖకు వచ్చారు. 21వ తేదీన విశాఖ ఛాతీ ఆస్పత్రిలో చేరారు. ఆ వ్యక్తి నుంచి కొత్తగా ఈ కేసు నమోదైనట్టు గుర్తించారు. రెండో తాజా కేసు గుంటూరులో నమోదు కాగా.. ఆ వ్యక్తి ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొని గుంటూరుకు వచ్చి ఈనెల 19న ఆస్పత్రిలో చేరారు. అతని నుంచి ఈ కేసు నమోదైనట్లు గుర్తించారు.  (ఒకేరోజు 14 మందికి కరోనా పాజిటివ్‌)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా