కార్పొరేషన్‌ హోదా ఉన్నట్టా..లేనట్టా?

4 Oct, 2019 12:21 IST|Sakshi
పురపాలక సంఘం పేరిట ఏర్పాటు చేసిన బోర్డు

ఇంకా మున్సిపల్‌ చైర్మన్‌ బాబా ప్రసాదేనా?

 కార్పొరేషన్‌లో సౌకర్యాలు మృగ్యం

పట్టించుకోని అధికార యంత్రాంగం

సాక్షి, కృష్ణా : మచిలీపట్నం నగరపాలక సంస్థో లేక పురపాలక సంఘమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పైగా పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండున్నర నెలలు దాటుతున్నా నేటికీ మున్సిపాలిటీలో గత పాలకవర్గమే కొనసాగుతున్నట్టుగా కన్పిస్తోంది. ఇందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. మచిలీపట్నం..అత్యంత పురాతనమైన పట్టణం దేశంలోనే రెండో పురపాలక సంఘం. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కల్గిన ఈ పట్టణానికి కార్పొరేషన్‌ హోదా కల్పిస్తూ 2015లోనే అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. పాలకవర్గం పదవీకాలం ఏడాదిన్నరకు పైగా ఉండడంతో సాంకేతిక కారణాల రీత్యా మున్సిపాల్టీగానే కొనసాగింది. ఈ ఏడాది జూలై 3వ తేదీన ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగియడంతో çపురపాలక సంఘం కాస్త కార్పొరేషన్‌ హోదాను సంతరించుకుంది. కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలతను ప్రభుత్వం నియమించింది.

పరిసర తొమ్మిది పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనాన్ని చేసేందుకు వీలుగా ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ అధికారులు మాత్రం తామింకా మున్సిపాల్టీలోనే కొనసాగుతున్నట్టు భావిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఏ సంస్థ హోదా అయినా అప్‌గ్రేడ్‌ అయితే ఆ హోదాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. 2015లోనే నగర హోదా వచ్చింది. సాంకేతికంగా చూసినా హోదా వచ్చి రెండున్నర నెలలు దాటింది. అయినా నేటికీ పురపాలక సంఘ కార్యాలయానికి కూడా కార్పొరేషన్‌ బోర్డు ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో అధికారులున్నారు. దీనికి పెద్ద ఖర్చు కాదు. అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాల్టీయో? కార్పొరేషనో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. పేరుకు కార్పొరేషన్‌ కానీ   థర్డ్‌ క్లాస్‌ పంచాయతీ కంటే ఘోరంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. పేరుకు సీసీ కెమెరాలా నిఘాలో ఉందని చెప్పుకోవడమే తప్ప ఎక్కడ పడితే అక్కడ  ఫైళ్లు.. ఏ అధికారి చాంబర్‌ ఎక్కడో కూడా తెలియని అయోమయ పరిస్థితి.

మాజీల పేర్లు
కార్యాలయంలోనే కాదు.. నగరంలో ఏ మూల చూసినా అదే పరిస్థితి. చైర్మన్, కౌన్సిలర్లు మాజీలై పోయి మూడు నెలలు కావస్తోంది. అయినా సరే సాక్షాత్తు మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్ల బోర్డులో నేటికీ మున్సిపల్‌ చైర్మన్‌గా బాబాప్రసాద్‌ కొనసాగుతున్నట్టుగానే ఉంది. ప్రత్యేకాధికారిగా జేసీ మాధవీలత బాధ్యతలు స్వీకరించి నెలదాటుతున్నా  ఆమె పేరు కూడా నేమ్‌ బోర్డులో పెట్టలేని దుస్థితి. ఇక మాజీలైన చైర్మన్, కౌన్సిలర్ల పేరిటే బోర్డులు హోర్డింగ్‌లు నగరంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. చివరకు వీధి పేర్లను సూచిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులపై కూడా కౌన్సిలర్లు పేర్లు కొనసాగుతున్నాయి. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే చేస్తాం.. కంగారే ముంది అనే ధోరణిలో సమాధానమిస్తుండడం విస్తుగొలుపుతోంది. ఇప్పటికైనా మున్సిపల్‌ యంత్రాంగం పురపాలకసంఘం బోర్డు తొలగించి కార్పొరేషన్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్న కౌన్సిలర్ల పేర్లు తొలగించాలని, కార్పొరేషన్‌ కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాట ఇచ్చిన చోటే ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ను ప్రారంభించారు..

మాదకద్రవ్యాల అడ్డాగా రాజధాని

జిల్లాలో వణికిస్తున్న వైరల్‌

మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

మంత్రాలయం–కర్నూలు రైల్వే లైనెప్పుడో? 

చదువుకుంటానంటే..పెళ్లి చేస్తున్నారని..

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

సైరా..సై..ఎద్దుల కుమ్ములాట!

ఎకో బొకేకి జిందాబాద్‌!

కల్పవృక్షంపై కమలాకాంతుడు

అటు పర్యావరణ పరిరక్షణ.. ఇటు జంతు సంరక్షణ

ఉపాధ్యాయులను పీడిస్తున్న ఎంఈఓలు

మా కడుపులు కొట్టొద్దు 

చేప...వలలో కాదు.. నోట్లో పడింది

చర్చనీయాంశంగా ‘పచ్చ’పోలీసు

టీడీపీ రాజకీయ కుట్రలు చేస్తోంది: పుష్ప శ్రీవాణి

సీఎం జగన్‌ మాటంటే మాటే!

అంతలోనే ఎంత మార్పు! 

భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

ఇక స్టాక్‌యార్డుల్లో నిండుగా ఇసుక

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో సగం మహిళలకే

బ్రాండ్‌థాన్‌తో ఏపీకి బ్రాండింగ్‌

మాట ఇచ్చిన చోటే.. మరో చరిత్రకు శ్రీకారం

ఇక సాగునీటి ప్రాజెక్టుల పనులు చకచకా

ముందే 'మద్దతు'

ఏపీ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్‌ జేకే మహేశ్వరి

బోటు ప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు

పది రోజుల్లో ఇసుక సమస్యకు పరిష్కారం : ఎంపీ

దేవినేని ఉమా బుద్ధి మారదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం

స్నేహ సీమంతం వేడుక...