జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

4 Jun, 2017 19:00 IST|Sakshi
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

శ్రీహరికోట: వరుస విజయాలతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మంచి ఊపుమీదుంది. అంతరిక్షరంగంలో అద్భుతమైన ప్రయోగాలతో అగ్రరాజ్యాలకు కన్నుకుట్టేలా దూసుకుపోతోంది. ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంది.

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–డీ1 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిరోధనా సంస్థ దాదాపు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన భారీ రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌-3-డీ-1ను సోమవారం సాయంత్రం 5 గంటల 28 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఇంతవరకు ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లన్నింటిలో ఇప్పుడు ప్రయోగించబోయేది అత్యంత పెద్ద రాకెట్‌. ఈ రాకెట్‌ ద్వారా జీ-శాట్‌19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు.

మరిన్ని వార్తలు