దంపతుల ఆత్మహత్యాయత్నం: భార్య మృతి

15 Oct, 2015 19:05 IST|Sakshi

కర్నూలు (బనగానపల్లె) : కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో గురువారం దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా.. కుటుంబసభ్యులు హుటాహుటిన బనగానపల్లెలో ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భార్య వెంకటలక్ష్మి(50) మృతిచెందగా, భర్త రామచంద్రారెడ్డి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబకలహాలతోనే ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా