కరోనా వివరాలను వెల్లడించిన ఏపీ సర్కార్‌

15 Mar, 2020 11:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: కోవిడ్‌-19 విజృంభణతో యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. 136 దేశాలకు విస్తరించిన ఈ ప్రాణాంతక వైరస్‌ను అంటువ్యాధిగా పరిగణించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌-19ను ‘ప్రపంచ మహమ్మారి’గా ప్రకటించింది. ప్రాంతాలు దాటిన కరోనా ప్రపంచాన్ని కమ్మేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిఘా, నియంత్రణ, నివారణతో వైరస్‌కు అడ్డుకుట్ట వేయొచ్చని వెల్లడిం‍చింది. ఈమేరకు ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వివరించారు.

ఇప్పటివరకు వైరస్‌ అనుమానితులుగా పరీక్షలు జరిగినవారు 70 మంది
కరోనా పాజిటివ్‌ కేసుగా తేలింది 1
నెగెటివ్‌గా నిర్ధారణ అయింది  57 మంది
శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సినవి 12

ఇప్పటివరకు స్క్రీనింగ్‌ జరిగింది, పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య: 777
పర్యవేక్షణలో ఉన్న బాధితుల సంఖ్య 512
28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244
ఆస్పత్రి అబ్జర్వేషన్‌లో ఉన్నవారి సంఖ్య 21

విజయవాడలో నిర్ధారణ పరీక్ష..
1897 అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో కోవిడ్‌-19 వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక కోవిడ్‌-19 ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు.

సహాయ కేంద్రాలు.. జాగ్రత్తలు

  • 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌. నెం.0866 2410978 ఏర్పాటు.
  • కరోనాపై సమాచారం కొరకు 104 హెల్ప్‌ లైన్‌ (టోల్‌ఫ్రీ నెంబర్‌)కు ఫోన్‌ చేయొచ్చు.
  • దగ్గినపుడు, తుమ్మినపుడు నోరు, ముక్కుకు చేతి రుమాలు, తువ్వాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. 

బాధ్యతగా ఉండాలి..

  • కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారు వైరస్‌ లక్షణాలు ఉన్నా లేకున్నా 28 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలి.  
  • బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదు. కుటుంబ సభ్యులు, బంధువులకు దూరంగా ఉండాలి.
  • దగ్గు, జ్వరం ఉన్నవారు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. 108 సాయంతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలి. లేదంటే 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ (0866 2410978)కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి. 

జిల్లాలవారీగా కరోనా వివరాలు..

మరిన్ని వార్తలు