సోషల్‌ మీడియాలో కోవిడ్‌ అధికారిక సమాచారం

12 Apr, 2020 03:36 IST|Sakshi
కోవిడ్‌19 నియంత్రణ చర్యలపై సమగ్ర సమాచారాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకునేందుకు ఉద్దేశించిన వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌బాట్‌లను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌ సర్వీస్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

వాట్సాప్‌ చాట్‌బాట్‌ నంబర్‌: 8297104104

ఈ చాట్‌బాట్‌ లింక్‌ https://wa.me/918297104104

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌–19 నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు వాట్సప్, పేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేస్తూ.. ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అందించే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏర్పాట్లు చేసింది. 

► ఈ చాట్‌బాట్‌ ద్వారా కరోనా వైరస్‌ గురించి ప్రాథమిక సమాచారం, వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సేవలు, తాజా సమాచారం తెలుసుకోవచ్చు. 
► ప్రజలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. 
► ఫేస్‌బుక్‌లో ఆరోగ్య ఆంధ్రాను ఫాలో అవ్వడం ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారం పొందవచ్చు.
కరోనా వైరస్‌ గురించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ 104, లేదా 0866–2410978 నంబర్లలో, ఈ మెయిల్‌  ఛిౌఠిజీఛీ–19జీnజౌః్చp.జౌఠి.జీnలో సంప్రదించవచ్చు. 
► ఈ కార్యక్రమంలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు