కరోనా అలర్ట్‌: హమ్మయ్య.. అతనికి వైరస్‌​ లేదు

3 Mar, 2020 11:20 IST|Sakshi
చెన్‌తో మాట్లాడుతున్న జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ సుబ్బారావు (పాత చిత్రం)

సాక్షి, తిరుపతి: రుయా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తైవాన్‌కు చెందిన కరోనా అనుమానిత వ్యక్తికి వైరస్‌ లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌వీ రమణయ్య తెలిపారు. చెన్‌ షి షున్‌(35) రక్త నమునాలను పరీక్షల నిమిత్తం పుణెకు పంపగా కరోనా నెగటివ్‌ ఫలితాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఇవాళ అతన్ని డిశ్చార్జి చేస్తామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్‌ రమణయ్య పేర్కొన్నారు. కాగా, జలుబు, దగ్గుతో బాధపడుతున్న చెన్‌ షి షున్‌ను కోవిడ్‌-19 అనుమానిత వ్యక్తిగా రుయాలోని ప్రత్యేక వార్డులో చేర్పించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న అతడు తైవాన్‌ నుంచి పలు యంత్రాలను అమరరాజ గ్రూప్స్‌కు తీసుకు కొచ్చి వాటిని అమర్చే పనిలో ఉన్నాడు.  ఈ క్రమంలో అతడికి రెండు రోజులుగా జలుబు, దగ్గ తీవ్రతరం అయ్యాయి. వాటిని కోవిడ్‌ లక్షణాలుగా భావించి రుయాలో చేర్పించారు.
చదవండి:
కరోనా బ్రేకింగ్‌: గాంధీలో 8 మంది అనుమానితులు
ఆకాశవీధిలో..నో టూర్స్‌
ఓ మై గాడ్‌..కోవిడ్‌

>
మరిన్ని వార్తలు