'మేము లాఠీలు వాడలేదు, వాడటం లేదు'

17 May, 2020 19:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పటమటలో బెంగాల్‌కు చెందిన వలస కార్మికులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారన్న ఆరోపణలను నగర సీపీ ద్వారకా తిరుమలరావు తోసిపుచ్చారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వలస కూలీలకు పోలీసుల తరుపున బాసటగా నిలుస్తున్నాం. వారికి పోలీస్‌ శాఖ తరపున మాస్క్‌లు, శానిటైజర్‌లు, చెప్పులు, పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నాం. కమిషనరేట్‌ పరిధిలో వలస కూలీల కోసం మూడు సహాయక శిబిరాలను ఏర్పాటు చేశాము.

పటమటలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వారు స్వస్థలాలకు వెళ్లడానికి రిజిష్టర్‌ చేసుకున్నారు. అక్కడ వారిని కొందరు కావాలనే రెచ్చగొట్టారు. వారికి తగిలిన దెబ్బలు కొట్టినవి కాదు. మేము లాఠీలు వాడలేదు, వాడటం లేదని' వివరణ ఇచ్చారు. కాగా రాజకీయ పక్షాలు లాక్‌డౌన్‌ టైమింగ్స్‌ పాటించాలని కోరారు. లేదంటే చట్టంద్వారా సమాధానం చెప్పడం మాకు తెలుసు. చట్ట పరంగానే ముందుకు వెళ్తాం. రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరుస్తాం. కొత్త సడలింపుల ప్రకారం చట్టపరంగానే ముందుకు వెళ్తామని' విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు వివరణ ఇచ్చారు. చదవండి: 'ఆ విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు' 

మరిన్ని వార్తలు