'ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి'

23 Nov, 2016 17:00 IST|Sakshi
'ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి'

తిరుపతి : నోట్ల రద్దు విషయంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని సీపీఐ నేత కె.నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నోట్ల రద్దుకు బాధ్యత వహిస్తూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలన్నారు. నిత్యావసర చిల్లర దుకాణాలలో పాత రూ.500,రూ.1000 నోట్లను అనుమతించాలన్నారు. నోట్ల మార్పిడి గడువు పెంచి, సరిపడినంత రూ.50, 100 నోట్ల అందించాలని కోరారు. ఈ దీక్షకు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

మరిన్ని వార్తలు