'అన్నాడీఎంకేను చీల్చేందుకు బీజేపీ కుట్ర'

11 Feb, 2017 11:55 IST|Sakshi
'అన్నాడీఎంకేను చీల్చేందుకు బీజేపీ కుట్ర'

అనంతపురం : తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో శనివారం ఆయన మీడియాతో తమిళనాడులో ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రపతి పాలన పెట్టాలన్న కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ అవకాశం కల్పించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేకహోదా రాలేదన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బాబు అంటున్నారని.. ఇదే వైఖరి కొనసాగిస్తే చంద్రబాబుకు ప్రజలు ముగింపు పలుకుతారని సురవరం చెప్పారు.

మరిన్ని వార్తలు