‘మావోయిస్టు’కు పదేళ్లు..

21 Sep, 2013 04:29 IST|Sakshi

కామారెడ్డి, న్యూస్‌లైన్: సీపీఐ మావోయిస్టు పార్టీ పురుడు పోసుకుని పదేళ్లవుతోంది. సరిగ్గా 2004 సెప్టెంబర్ 21న ఆవిర్భవించింది. అంతకు ముందు సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌గా కొనసాగింది. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా పీపుల్స్‌వార్ పార్టీ నాయకత్వం, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) పార్టీలు విలీనమై ‘సీపీ ఐ మావోయిస్టు’ పార్టీని ఏర్పాటు చేశాయి. మావోయిస్టు పార్టీ శనివారంనాడు పదోయేట అడుగిడిన సం దర్భంగా జిల్లాలో ఆ పార్టీ ఉద్యమంపై ప్రత్యేక కథనం..
 
 పీపుల్స్‌వార్ బలమైన నక్సలైట్ పార్టీ గా జిల్లాలో ఉద్యమం కొనసాగించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సమాంతర పాలన సాగించింది. ఆ పార్టీపై 1992లో నిషేధం విధించిన తరువాత పార్టీ మరింత బలోపేతమైంది. జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో 1995 నుంచి 2000 మధ్య కాలంలో ఆ పార్టీ కార్యకలాపాలు జోరుగా సాగా యి. తీవ్ర నిర్బంధంతో లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లతో జిల్లాలో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. క్యాడర్‌ను కోల్పోయింది. 2004లో మావోయిస్టు పార్టీగా అ వతరించేనాటికి జిల్లాలో అనేక నష్టాలను  
 చవిచూసింది. జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్‌తో పాటు మిలిటెంట్లు, సానుభూతి పరులు 125 మంది వరకు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది అరెస్టయ్యారు.
 
 అలాగే వందలాది మంది లొంగిపోయారు. కాగా మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన సమయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శిగా పని చేసిన గంగుల వెంకటస్వామి అలియాస్ రమేశ్ నా యకత్వంలో పార్టీ కార్యకలాపాలు జోరుగానే సాగా యి. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కూడా కొనసాగుతున్నపుడు ఊరూరా సాయుధ నక్సల్స్ వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో మా నాల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో జిల్లాలో మావోయి స్టు పార్టీ ఉనికి లేకుండాపోయింది. జిల్లాకు చెందిన వారిని ఇతర రాష్ట్రాలకు పంపించింది. అయితే కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన స్వా మి అలియాస్ లోకేటి చందర్‌ను కరీంనగర్ (పశ్చి మ), ఆదిలాబాద్, నిజామాబాద్ కార్యదర్శిగా నియమించినట్టు ఆరు నెలల క్రితం వార్తలు వెలుబడ్డా జిల్లాలో మాత్రం కార్యకలాపాలు వెలుగుచూడలేదు.
 
 అజ్ఞాతంలో జిల్లావారు తొమ్మిది మంది....
 సీపీఐ మావోయిస్టు పార్టీలో జిల్లాకు చెందిన తొమ్మిది మంది ఇతర రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అందులో కామారెడ్డి ప్రాంతానికి చెందినవారే ఎనిమిది మంది ఉన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన స్వామి అలియాస్ లోకేటి చందర్  బస్తర్/చత్తిస్‌ఘడ్ స్పెషల్‌జోన్ కమిటీ సభ్యుని హోదాలో పనిచేస్తున్నట్టు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. స్వామి భార్య లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన సౌత్‌బస్తర్ ప్రాంతంలోని కుంట ఏరియా మహిళా దళ కమాండర్‌గా పనిచేస్తున్నారు.
 
 అలాగే స్వామి కొడుకు లోకేటి రమేశ్ సౌత్ బస్తర్ ప్రాంతంలో జననాట్యమండలి టీంలో, ఆయన కూతురు లోకేటి లావణ్య వెస్ట్ బస్తర్‌లో టీచర్‌గా, ప్రెస్‌మెంబర్‌గా పనిచేస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ రాయ్‌పూర్ ప్రాంతంలో దళ కమాండర్‌గా పనిచేస్తున్నారని చెబుతున్నారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన క్యాతం శ్రీనివాస్ అలియాస్ సూరజ్ అబూజ్‌మడ్ ఏరియాలో రీజినల్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన వెంకటరెడ్డి. డిచ్‌పల్లి మండలం ఇందల్వాయికి చెందిన లచ్చాగౌడ్  దండకారణ్యంలో దళ సభ్యులుగా పనిచేస్తున్నారు. ధర్పల్లి మండలం లింగాపూర్‌కు చెందిన మొడెల సాయిలు అలియాస్ రఘు అలియాస్ రవి  రీజినల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నట్లు పోలీసుల రికార్డులు పేర్కొంటున్నాయి.
 

మరిన్ని వార్తలు