'ఆయన తప్పుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా'

3 Dec, 2015 19:53 IST|Sakshi
'ఆయన తప్పుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా'

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర మంత్రివర్గం నుంచి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వైదొలగాలని సీపీఐ నాయకుడు కె. నారాయణ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వాతావరణాన్ని పట్టి బీజేపీ నేతలు మాట మారుస్తున్నారని, సీఎం చంద్రబాబు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 

పార్లమెంటులో ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడే ఏకాభిప్రాయం విషయాన్ని ఎందుకు మాట్లాడలేదని మంత్రి వెంకయ్యనాయుడును ప్రశ్నించారు. ఢిల్లీలో గురువారం నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద జరగనున్న ధర్నాకు అన్ని రాజకీయా పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. సీఎం చంద్రబాబు ఇసుక మాఫియా చేతిలో బందీగా ఉన్నారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించకుంటే అక్కడే గోరి కడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు