'లక్షల కోట్లతో కార్పొరేట్లకు మోదీ ఊడిగం'

5 Jul, 2015 17:35 IST|Sakshi

బేతంచెర్ల (కర్నూలు జిల్లా): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 100 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు పంపిణీ చేస్తామని నేటికి 400 రోజులు కావస్తున్నా వాటిని అమలు చేయలేదని సీపీఎం నేతలు విమర్శించారు. పేదలకు, రైతులకు ఇస్తున్న సంక్షేమ పథకాలలో కోత కోసి సామన్య ప్రజలపై భారాలు మోపి పెట్టుబడిదారులకు రూ.5 లక్షల కోట్లు కేటాయించి ఊడిగం చేస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు.

భూస్వాములకు,పెట్టుబడిదారుల దోపిడికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా వర్గ పోరాటాలు నిర్వహించడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం డోన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం డోన్ డివిజన్ కార్యదర్శి ఈశ్వరయ్యలు తెలిపారు. ఆదివారం స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షురాలు బెల్లం అంజలి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు కావస్తున్నా పేదల కనీస అవసరాలు తీర్చటంలో పాలకులు విఫలమయ్యాయని వారు విమర్శించారు.

మరిన్ని వార్తలు