సమర భేరి

19 Apr, 2015 03:43 IST|Sakshi

నేడు ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ
పూర్తయిన ఏర్పాట్లు కళా బృందాలతో భారీ ర్యాలీ
వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశాలు

 
సాక్షి, విశాఖపట్నం : నగర వీధుల్లో రెపరెపలాడిన ఎర్రజెండా నేడు సాగరతీరంలో ఎగరనుంది. సీపీఎం జాతీయ మహాసభల ముగిం పు సందర్భంగా ఆదివారం సాయంత్రం సాగరతీరంలో కాళీమాత టెంపుల్ దగ్గర జరిగే ఈ సభ మరో అపురూప ఘట్టం కానుంది. పార్టీ అధినాయకత్వం సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీపీఎం 21వ అఖిల భారత మహాసభలు ఈ నెల 14న పోర్టు కళావాణి ఆడిటోరియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవి 19వ తేదీతో ముగుస్తున్నాయి.

ఆదివారం మధ్యాహ్నం వరకూ రాజకీయాలపై చర్చ కొనసాగిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3గంటల నుంచి ప్రజాప్రదర్శన చేపట్టనున్నారు. కళారూపాలు, జానపద నృత్యాలు, డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్లు, ఎర్రదండు, పులి వేషాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. మహాసభకు ముందు వెయ్యి మంది డప్పు కాళాకారులు వాయిద్యాలతో కవాతు నిర్వహించనున్నట్లు కులవివక్ష పోరాట కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎమాల్యాద్రి తెలిపారు. సీపీఐ(ఎం)ముఖ్య నేతలు బహిరంగ సభలో ప్రసంగింనున్నారు.

బహిరంగ సభకు హాజరయ్యే వారికి పార్టీ సూచనలు:
► మహా ప్రజా ప్రదర్శనలో పాల్గొనే వారు మధ్యాహ్నం 2గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ (ఆశీల్‌మెట్ట) ప్రాంతానికి చేరుకోవాలి.
► డప్పు కాళాకారులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ ఔట్ గేటు వద్దకు రావాలి.
► రెడ్ షర్ట్, శారీ ధరించిన వారంతా ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్దకు చేరుకోవాలి.
► అందరూ బ్యాడ్జీలు ధరి ంచి, జెండా పట్టుకోవాలి.
► ప్రదర్శనకు వచ్చిన వా రంతా జిల్లాల వారీగా వరుస క్రమంలో నిలబడాలి.ఈ బాధ్యతను కార్యకర్తలు నిర్వర్తించాలి.
►మధ్యాహ్నం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఆ సమయానికి ముందుగానే అ ందరూ సభా ప్రాంగణానికి చేరుకోవాలి.
►నిర్ధేశిత ప్రాంతాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.
►వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ తాడిచెట్లపాలెం (ఎన్‌హెచ్5) జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వైపు వచ్చి అక్కడ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. ఫ్లై ఓవర్ ప్రారంభంలో జనాన్ని దించి వాహనాలు ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లిపోవాలి.
►విశాఖ రూరల్, ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లి ఆంధ్రా యూనివర్శిటీ ఔట్‌గేటు వద్ద గల ఏయు జిమ్నాజియం గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలి.
►విశాఖ నగర వాహనాలు ఫ్లైఓ వర్ మీదుగా వెళ్లి ఆలిండియా రేడియో దగ్గర్లోని పోర్టు గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలి.

మరిన్ని వార్తలు