సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ

27 Nov, 2019 11:35 IST|Sakshi

సాక్షి, అమరావతి :  కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌) రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వర్కింగ్‌ కమిటీని నియమించింది. చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్‌, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్‌, వైద్య శాఖ కార్యదర్శులు ఉన్నారు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నియమించింది. ఎన్పీ టక్కర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తుంది. జూన్‌ 30లోపు నివేదిక అందజేయాలని వర్కింగ్‌ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 

>
మరిన్ని వార్తలు