క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌

23 Sep, 2017 03:51 IST|Sakshi

వేర్వేరు ఘటనల్లో 9 మంది కటకటాలపాలు

పట్నంబజారు(గుంటూరు) : క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తులతోపాటు, నిర్వాహకులను అర్బన్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌.విజయరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. అరండల్‌పేట పరిసర ప్రాంతాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న  పోలీసులు క్యూఆర్టీ సిబ్బందితో కలిసి దాడి చేశారు.

ఈ దాడిలో చెరుకూరి రాధాకృష్ణ అనే నిర్వాహకుడు, సహాయకులు వడ్డూరి కృష్ణకిషోర్, తోక బాలయ్య, పందెం కాసే వ్యక్తులు దాసరి ప్రసాద్, అన్నపురెడ్డి పొట్టయ్య, సిద్ధాబత్తిని హేమేశ్వర వెంకటమురళీమోహన్‌రావు, ఆలా అరవింద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ల్యాప్‌టాప్, ఒక టీవీ, ఐదు సెల్‌ఫోన్‌లతో పాటు రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్ల పాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో గేమింగ్‌ యాక్ట్‌ కింద పల్లపాటి శ్రీనివాసరావు, ముత్యాల శివవెంకటేశ్వరరావు అలియాస్‌ బాబు అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ క్రికెట్‌ బెట్టింగ్‌లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని చెప్పారు. బుకీలపై ఉక్కుపాదం మో పుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీలు వైటీ నాయుడు, ఇ.సుబ్బారాయుడు, డీఎస్పీలు కేజీవీ సరిత, కండె శ్రీనివాసులు, పి.శ్రీనివాస్, సీఐలు వై.శ్రీనివాసరావు, ఎన్‌.శ్రీకాంత్‌బాబు, టి.బాలమురళీకృష్ణ, క్యూఆర్టీ ఎస్సై షేక్‌ నాగుల్‌మీరా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు