అంగన్‌వాడీ కార్యకర్తపై క్రిమినల్‌ కేసు

9 Jul, 2019 10:15 IST|Sakshi
అంగన్‌వాడీ కార్యకర్త ఇంటి వద్ద తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

రాజమహేంద్రవరం : అంగన్‌వాడీ కార్యకర్తపై  క్రిమినల్‌ కేసు నమోదైంది. విజిలెన్స్‌ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు కథనం ప్రకారం.. శంఖవరం గ్రామంలో ఈ నెల 6వ తేదీన విజిలెన్స్‌ అధికారులు అంగన్‌ వాడీ కేంద్రం నంబర్‌ 03ను (ఎస్సీ పేట లో ఉన్న) తనిఖీ చేసి కేంద్రంలో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసిన సరుకులు జూలై నెలకు సంబంధించినవి ఏమీ లేకపోవడం గుర్తించారు. అంగన్‌ వాడీ కార్యకర్త మేడిద లక్ష్మి సరుకులను ఈ నెల 4వ తేదీన తీసుకొని పీఎఫ్‌ షాపులో ఉంచామని తెలిపారు. పీఎఫ్‌ షాపులో తనిఖీ చేసిన అధికారులు అక్కడ అంగన్‌ వాడీ కేంద్రానికి సంబంధించిన సరుకులు లేకపోవడం, నాలుగో తేదీన లక్ష్మి అంగన్‌ వాడీ కేంద్రానికి సరుకులు తీసుకువెళ్లినట్టు విచారణలో తేలడంలో ఆమె ఇంటిని తనిఖీ చేయగా 82 కోడిగుడ్లు, 25 కిలోల పీడీఎస్‌ బియ్యం, చోడిపిండి 22 ప్యాకెట్లు గుర్తించారు.  శంఖవరం మండలం అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ ఫిర్యాదు మేరకు అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో లక్ష్మిపై సెక్షన్‌ ఐపీసీ 406, 7 ఈసీఏ (ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన నిత్యావసర వస్తువులు దుర్వినియోగం) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ అంగన్‌ వాడీ కేంద్రానికి జూలైæ నెలకు సంబంధించిన మొత్తం సరుకులు బియ్యం 130 కేజీలు, పప్పు 29 కేజీలు, ఆయిల్‌ ఆరు ప్యాకెట్లు, శనగలు 7.5 కేజీలు, ఉప్పు 2 ప్యాకెట్లు, ఉండాల్సి ఉండగా మేడిద లక్ష్మి ఇంటి వద్ద తక్కువగా ఉండడం గమనించారు. విచారణలో లక్ష్మి సరుకులు బయట మార్కెట్‌లో అమ్ముతున్నారని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తామని విజిలెన్స్‌ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు