పరమపవిత్రం స్ఫటిక లింగం

6 Oct, 2019 08:15 IST|Sakshi

సాక్షి, రాజాం : రాజాం పట్టణం అనగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది తాండ్ర పాపారాయుడు. రాజాం కేంద్రంగా బొబ్బిలి రాజుల ప్రతినిధిగా ఆయన పాలన సాగించేవారు. ఇదే సమయంలో అక్కడ ఆయన పలు ఆలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఎక్కువుగా వైష్ణవ ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో ఆయన మాత్రం సారధిలోని కూరాకుల వీధిలో ప్రత్యేకంగా స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్టించారు. లోక కల్యాణార్థం అప్పట్లో ఆయన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచి్చన రాతితో నిర్మించినట్లు చెబుతారు. మరోవైపు ఈ ఆలయంలో గర్భగుడి కుడి, ఎడమ వైపునున్న గుడుల్లో గణేశుని ప్రతిమతతో పాటు పార్వతిదేవి ప్రతిమలు ఉత్తర, దక్షిణ ముఖంగా ఉంటాయి. ఇలా ఈ రెండు విగ్రహాలు ఉత్తర, దక్షిణ ముఖాలుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. తాండ్ర పాపారాయుడు ప్రతిరోజు ఉదయం శివలింగ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేసేవారని తెలుస్తోంది. ఈ శివలింగానికి నిష్టతో పూజచేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 

మరిన్ని వార్తలు