ఎవరు గెలిచినా..ఉద్యమం ఆగదు!

26 Dec, 2013 04:22 IST|Sakshi
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:  ఎన్జీవో ఎన్నికలను రాజకీయ కోణంలో చూడొద్దని.. ఎవరు గెలిచినా..సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృ తం చేస్తామని ఎన్‌జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు స్పష్టం చేశా రు. శ్రీకాకుళం ఎన్జీవో హోంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సమైక్య ఉద్యమంపై ఎన్‌జీవోల ఎన్నికల ప్రభావం ఉండదన్నారు.  ఎన్నికల్లో తమ ప్యానెల్ తప్పకుండా గెలుస్తుందన్న  ధీమా ను వ్యక్తం చేశారు.  రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ  చేపట్టిన ఉద్యమం ఏపీ ఎన్జీవోలను సముచిత స్థానంలో ఉంచిందన్నారు. గత ప్యానెల్‌తోనే పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.  ఉద్యోగ సంఘాల్లో రాజకీయ పార్టీల పాత్ర లేదని కుండబద్దలు కొట్టారు.
 
 ఎన్జీవో సంఘ ఎన్నికలు ముగిసిన వెంటనే సమైక్యాంధ్ర కోసం తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తామన్నారు. 27, 28తేదీల్లో అఖిలపక్ష  సమావేశం నిర్వహిస్తామని,  28న అన్ని పార్టీల సీమాంధ్ర ఎమ్మెల్యేలతో  సమావేశాన్ని  ఏర్పాటు చేసి,  సమైక్య తీర్మానాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌కు పంపుతామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయమన్నారు. ఏపీ ఎన్జీవో సంఘ ప్రతినిధి చంద్రశేఖర్ మాట్లాడుతూ అశోక్‌బాబు నాయకత్వంలో ఉన్న ప్యానల్‌కే ఉద్యోగులందరి మద్దతూ ఉంటుం దన్నారు. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌కార్డులు తప్పుల తడకగా ఉన్నాయని, ఉద్యోగులు కోరిన విధంగానే జారీ చేయాలన్నారు. ఎన్జీవో సంఘ ప్రతినిధి చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ మధ్యంతర భృతిపై త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారన్నారు. హెల్త్‌కార్డులపై ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉందన్నారు. ఎన్నికల  కారణంగా ఎన్జీవో సంఘం చీలికలా కనబడుతోందని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంతా కలసి సమిష్టిగా సమస్యలపై పోరాడతామన్నారు. సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం కూడా  మాట్లాడారు.
 
 ఉద్యమ స్ఫూర్తితో ముందుకు..
  జిల్లా  సమైక్య ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతామని  అశోక్‌బాబు చెప్పారు. స్థానిక ఎన్జీవో హోంలో ఎన్జీవో సం ఘ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య ఉద్యమంలో పాల్గొనడం వల్లే.. ఎన్జీవోలకు గుర్తింపు లభించిందన్నారు. సంక్రాంతి తరువాత అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని..ఉద్యమిస్తామన్నారు. అశోక్‌బాబు ప్యానల్‌నే గెలిపించాలని చౌదరి పురుషోత్తంనా యుడు కోరారు.  హనుమంతు సాయిరాం మాట్లాడుతూ.. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు అశోక్‌బాబు క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి..క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘ ప్రతినిధులు చం ద్రశేఖర్‌రెడ్డి,  డీవీ రమణ, ఆర్.రవిశంకర్, కె.ఈశ్వరరావు, బీ.సీహెచ్.ఎస్.ఎస్.ప్రభూజీ, డి.సన్యాసిరాజు, పి. వీరేం ద్రబాబు, జయలక్ష్మి, తులసీరత్నం, బుక్కూరు ఉమామహేశ్వరరావు, అధిక సంఖ్యలో ఎన్జీవో సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు