సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి

12 Jan, 2015 02:12 IST|Sakshi

సంక్రాంతి సంబరాలలో ఆర్డీఓ వినాయకం

చాపాడు:  సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం పేర్కొన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞాన భారతీ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా ఆదివారం సంక్రాంతి సంబరాలను జరిపారు. ఈ సంబరాలకు హాజరైన ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో వాస్తవికత ఉంటుంద న్నారు. వీరి వల్లనే ఇంకా సంస్కృతి, సంప్రదాయాలు బతికి ఉన్నాయన్నారు. అనంతరం పలువురు వక్తలు సంక్రాంతి సంబరాల విశిష్టతపై ప్రసంగించారు.   

సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన పలు రకాల క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి, రూరల్ సీఐ పురుషోత్తమరాజు, ఎస్‌ఐ గిరిబాబు, ప్రొద్దుటూరు వైవీయూ ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
సంక్రాంతి కళ: మూడు రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందా అనే విధంగా చాపాడు సమీపంలోని సీబీఐటీ-వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలలో ఆది వారం గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రైతులుగా.. అల్లరి చే సే కొంటెవాళ్లుగా.. సంప్రదాయ వస్త్రాలతో అచ్చతెలుగు ఆడపడుచుల్లా.. హరిదాసుల్లా.. ఇలా వివిధ వేషధారణలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.

మరిన్ని వార్తలు