విజయనగరంలో నేడు కర్ఫ్యూ ఎత్తివేత

13 Oct, 2013 12:00 IST|Sakshi

తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరంలో ఉవ్వెత్తున్న ఎగిసిన నిరసన జ్వాలలు కాస్త తగ్గుముఖం పట్టాయి. పట్టణంలో పరిస్థితులు చల్లబడటంతో కర్య్ఫూను 14 గంటల పాటు సడలించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కర్య్ఫూను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. రేపటి నుంచి పూర్తిగా తొలగించే అవకాశముందని తెలిపారు. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు.  

సమైక్యాంధ్ర కోసం విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. ఉద్యమం తీవ్రం రూపందాల్చడంతో హింస చెలరేగింది. ఉద్యమకారులు బొత్స ఆస్తులుపై దాడిచేశారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అయినా పరిస్థితులు అదుపులోకి ఈ నెల 5 నుంచి రాకపోవడంతో కర్య్ఫూ విధించారు.

>
మరిన్ని వార్తలు