అంతలోనే ఎంత మార్పు! 

4 Oct, 2019 07:55 IST|Sakshi
ఖకోటబొమ్మాళిలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద క్యూలో నిలబడి సరుకు కొంటున్న వినియోగదారులు

సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం) : వేళాపాళా లేకుండా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు... దుకాణాల్లోనే కాకుండా బెల్టుషాపుల్లో విచ్చలవిడి విక్రయాలు... అక్కడే మద్యపానం... మత్తులో చెలరేగే ఘర్షణలు... గొడవలు మరీ మితిమీరితే పోలీసులు జోక్యం చేసుకోవడాలు.. ఇవీ ఇంతవరకు కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో ప్రతి ఏటా కనిపించే అవాంఛనీయ దృశ్యాలు.. మందుబాబుల బెడదతో ఎటువంటి సంఘటనలు జరుగుతాయోనని అటు నిర్వాహకులు, ఇటు ఉత్సవాలకు వచ్చిన భక్తులు భయాందోళన చెందేవారు. అయితే ఈసారి మూడు రోజులుగా అమ్మవారి ఉత్సవాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ప్రైవేటు మద్యం షాపులకు కళ్లెం వేసి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమలుచేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పువచ్చింది. ఇ

దిగో ఈ చిత్రం లో కనిపిస్తున్నట్టు ప్రభుత్వ దుకాణం వద్ద వినియోగదారులు క్యూలో నిలబడి క్రమశిక్షణగా మద్యం కొనుగోలు చేయడంతో.. ఇది కలా నిజమా అనిపించింది. కోటబొమ్మాళిలో ఉదయం 11 గంటలకు షాపు తెరిచేసరికి రెండు వరుసల్లో బారులు దీరి మద్యం కొనుగోలు చేశారు. వీరిని అదుపు చేసేందుకు ఎక్సైజ్, పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో అంతా ప్రశాంతంగా సాగిపోతోంది. ఈ మార్పుతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అపశ్రు తులు లేకుండా పండుగ సాగుతోందని నిర్వాహకులు సంబరపడుతున్నారు. 

మరిన్ని వార్తలు