తెల్లకార్డులు కట్..

18 Jun, 2014 01:27 IST|Sakshi
తెల్లకార్డులు కట్..

{పభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు
జిల్లాలో కుటుంబాలు 11 లక్షలు
{పస్తుతం కార్డుల సంఖ్య 12,34,104
అంటే 1,34,104 కార్డులు అదనం
విధి విధానాలొచ్చిన వెంటనే అధికారుల చర్యలు

 
విశాఖ రూరల్ : జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నాయి. ఇది విస్మయాన్ని కలిగించే అంశం. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా సుమారు 44 లక్షలు. కుటుంబానికి సగటున నలుగురు చొప్పున లెక్కేసినా జిల్లాలో 11 లక్షలు కుటుంబాలు మాత్రమే ఉండాలి. 2009లో అధికారుల లెక్కల ప్రకారం 8.5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలకు ముందు 9,85,126 తెల్లరేషన్‌కార్డుదారులు ఉన్నారు. కుటుంబాల సంఖ్య కంటే కార్డుల సంఖ్య అధికంగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితం బోగస్ కార్డులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఈమేరకు రెండు నెలల పాటు చేపట్టిన సర్వేలో కేవలం 50 వేల కార్డులను మాత్రం రద్దు చేశారు. దీంతో లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో 1,35,978 మందికి అదనంగా రేషన్‌కార్డులిచ్చారు. దీంతో సంఖ్య 11,21,104కు చేరుకుంది. మళ్లీ రెండోసారి బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు.

పౌర సరఫరా శాఖ అధికారుల ప్రకటనలు, చర్యలకు పెద్దగా స్పందన రాలేదు. కేవలం 22 వేల మంది మాత్రమే కార్డులు వెనక్కు ఇచ్చారు. రచ్చబండ-2లో 1.5 లక్షల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా 1.13 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించి తాత్కాలిక కూపన్లు అందజేశారు. దీని ప్రకారం ప్రస్తుతం కార్డు సంఖ్య 12,34,104కు చేరుకుంది. అయితే ఎన్ని విధాలుగా లెక్కలు వేసుకున్నా జిల్లాలో కుటుంబాల సంఖ్య 11 లక్షలకు మించదు. దీనిని బట్టి చూస్తే 1,34,104 కార్డులు అదనంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రచ్చబండ-3లో మరో 60 వేల మంది వరకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రతీ సోమవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికీ వెల్లువలా కార్డుల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి.
 
 

మరిన్ని వార్తలు