ఏటీఎం కార్డ్‌ బ్లాక్‌ అయ్యిందంటూ మోసం

8 May, 2018 08:27 IST|Sakshi

ఆర్టీసీ డ్రైవర్‌ను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాడు 

 బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.75 వేలు అపహరణ

ఎమ్మిగనూరు రూరల్‌: ఓ సైబర్‌ మోసగాడు ఆర్టీసీ డ్రైవర్‌ను బురిడీ కొట్టించాడు. ఏటీఎం కార్డ్‌ బ్లాక్‌ అయ్యిందంటూ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 75 వేలు అపహరించాడు. నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఆర్‌.రామకృష్ణ సెల్‌కు సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో 6295665582 నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఎస్‌బీఐ బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాం. మీ ఏటీఎం బ్లాక్‌ అయ్యింది. ఆధార్‌ నంబర్‌ చెబితే సరి చేస్తాం’ అంటూ ఓ వ్యక్తి చెప్పాడు.

 లైన్‌లో ఉండి అతను అడిగిన సమాచారాన్ని రామకృష్ణ చెప్పేశాడు. మోసగాడి సూచన మేరకు  సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ చెప్పడంతో పాటు మెసేజ్‌లను డిలీట్‌ చేశాడు. కొద్ది సేపటి తరువాత తన ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్‌ (11164897488) నుంచి రూ.75 వేలు డ్రా అయినట్లు సెల్‌కు మెసేజ్‌  వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ అధికారులను కలిశాడు. అయితే సైబర్‌ మోసాలను తాము పరిష్కరించలేమని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

మరిన్ని వార్తలు