సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయ్‌!

15 Dec, 2018 13:18 IST|Sakshi
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ద్వారకా తిరుమలరావు

15 శాతం మాత్రమే రికవరీ

బ్యాంక్‌ ఓటీపీ మోసాలే ఎక్కువ

‘చేరువ’ ద్వారా నేరాలపై అవగాహన

బ్యాంకర్ల సమావేశంలో సీపీ ద్వారకా తిరుమలరావు

సాక్షి, అమరావతిబ్యూరో :  ‘గత మూడేళ్లుగా నగరంలో సైబర్‌ నేరాలు పెరిగాయి. ముఖ్యంగా ఓటీపీ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బు డ్రా చేసుకునేందుకు వస్తున్న కొంత మందికి సాంకేతిక అంశాలపై అవగాహన లేకపోవడంతో ఇతరులపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు నేరాగాళ్లు బ్యాంకు ఏటీఎం కార్డులను తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక రకంగా ఆందోళనకరమే. అయితే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి నేరాలు జరగకుండా చూడొచ్చు.’ అని బెజవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పోలీసు కమిషరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘సైబర్‌ నేరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పోలీసు–బ్యాంకు విభాగాల మధ్య సమన్వయం..’ తదితర అంశాలపై సీపీ ద్వారకా తిరుమలరావు చర్చించి పలు సూచనలు చేశారు. ‘బ్యాంకుల వద్ద సెక్యూరిటీని నియమించుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే సైబర్‌ నేరాలను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. అవసరమైన సందర్భాల్లో పోలీసులు కోరిన విధంగా అకౌంట్లను ప్రీజ్‌ చేయాలని కోరారు. వినియోగదారులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. మోసం జరిగిన వెంటనే డయల్‌ 100కు గాని, ఫోర్త్‌ లయన్‌ యాప్‌ ద్వారా గాని, విజయవాడ సిటీ పోలీసు వాట్సప్‌  7328909090కి గాని, ‘చేరువ’ నేర నియంత్రణ సిబ్బందికిగాని, ఇంటర్‌సెప్టార్‌ వాహన సిబ్బందికిగాని సమాచారం అందిస్తే త్వరితగతిన నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని సీపీ చెప్పారు.

సైబర్‌ నేరాలు పెరిగాయి...
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ.. నగరంలో సైబర్‌ నేరాలు పెరిగాయని అంగీకరించారు. విదేశీయులు అధికంగా చేస్తున్నారని.. మోసం చేసిన నేరగాళ్లు దేశం వదిలి పారిపోతున్నారని వివరించారు. మూడేళ్లలో సైబర్‌ నేరాలకు సంబంధించి 193 కేసులు నమోదు కాగా.. కేవలం 15 శాతం కేసులను మాత్రం చేధించామని చెప్పారు. సమావేÔ
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ద్వారకా తిరుమలరావుèæంలో డీసీపీలు రాజకుమారి, వెంకట అప్పలనాయుడు, గజరావు భూపాల్, ఉదయరాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు