కారు ఢీకొని సైక్లిస్టు మృతి

15 May, 2016 15:28 IST|Sakshi

చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం వనగట్ల వద్ద కారు ఢీకొనడంతో సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. వనగట్ల గ్రామానికి చెందిన నూతంగి వెంకట్రావ్ (40) ఆదివారం మధ్యాహ్నం సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో వెంకట్రావ్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు