ఉంపన్‌ పెనుతుపాన్: తాజా అప్‌డేట్‌

20 May, 2020 15:17 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉంపన్‌ పెనుతుపాన్ కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. పారాదీప్‌కు తూర్పు ఈశాన్యదిశగా 140 కిలోమీటర్ల దూరంలో, సాగర్‌ఐల్యాండ్‌కు దక్షిణదిశగా 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు పేర్కొంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ సాయంత్రంలోగా దిఘా(పశ్చిమ బెంగాల్‌)-హతియా దీవుల(బంగ్లాదేశ్‌) మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తీరం దాటనుందని వెల్లడించింది. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?)

తీరందాటే సమయంలో గంటకు 155-185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు.. తీరంవెంబడి గంటకు 45- 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, అంఫన్‌ పెనుతుపాన్ ప్రభావంతో పశ్చిమ బంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. (తుపాను ఎఫెక్ట్‌; ముందుకొచ్చిన సముద్రం)

ఫోటోగ్యాలరీ: తీరంలో అల్లకల్లోలం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు